మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఆరాధన ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. లోక రక్షకుడైన యేసు వారి యొక్క అంతిమ ఘడియలలో సిలువలో పలికిన ఏడు మాటలను పాస్టర్ పి. వసంత్ కుమార్ జ్ఞాపకం చేసినారు. ఏసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ మీద మన పాపముల కొరకు బలి అయ్యాడని ఈయన ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యమును ప్రవేశించడని సిలువలో పలికిన ఏడు ప్రశస్తమైన వాక్యాలను తెలియపరుస్తూ ప్రియా ఏసుక్రీస్తు ప్రభువుల వారు మనుషులకు దేవునికి వారధిగా ఉండి మానవాళి సమస్త మానవాళి సమస్త పాపాలకు తన రక్త ప్రోక్షణ ద్వార విముక్తి కలిగించాడని కొనియాడారు. ఈ ఆరాధనలో కమిటీ సభ్యులు బెన్నీ, దేవయ్య, స్వామి, ప్రవీణ్ సంతోష్, జానీ, ప్రవీణ్, అమ్మగారు వీణ కుమారి, కిరణమై, విశ్వాసమా ఎలిశమ్మ, చిన్నారులు పలువురు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.