బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ .
మెదక్ జిల్లా”కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్
చేగుంట మార్చి 29 ప్రాజబలం న్యూస్ :-
శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా చేగుంట మండల ప్రజలకు చందాయిపేట గ్రామ ప్రజలకు స్థానిక సర్పంచ్ తాజా మాజీ బుడ్డ స్వర్ణలత-భాగ్యరాజ్ క్రిస్టియన్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు.
క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత-భాగ్యరాజ్ పేర్కొన్నారు.