మా డబల్ బెడ్ రూమ్ కాలిని పట్టించుకోండి .

మున్సిపాలిటీ చైర్మన్ చైర్మన్ ముందు కాలనీవాసులు ఆవేదన
సానుకూలంగా స్పందించిన మున్సిపాలిటీ చైర్మన్.

పేదలు ఉండే డబుల్ బెడ్ రూమ్ కాలనీని పరిశుభ్రంగా ఉంచి మంచి ప్రశాంత వాతావరణంగా తయారు చేస్తాం.
మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ.

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణలను మర్యాదపూర్వకంగా కలిసి మా కాలనీవాసుల ఆవేదన పట్టించుకోండి అంటూ, పలు సమస్యలు వివరించారు . సానుకూలంగా స్పందించిన తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్.
వారి ఆవేదనను అర్థం చేసుకొని మున్సిపల్ అధికారులకు సిబ్బందికి డబుల్ బెడ్ రూమ్ సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సిబ్బందికి తెలిపారు. మున్సిపల్ సిబ్బంది చైర్మన్ గారి ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో స్వచ్ఛ భరత్ క్లీన్ & గ్రీన్ పరిశుభ్రంగా చెత్తాచెదారం లేకుండా క్లీన్ చేపిచ్చారు.

అనంతరం వారు మాట్లాడుతూ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే క్రిమి కీటకాలు రావని , చుట్టూ ఉన్న పరిసరాల ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొని మానవ మనుగడకు అవసరమైన హరితహారం ఆరోగ్యకరమైన చెట్లను నాటుతామని తూప్రాన్ మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచి పచ్చని చెట్లతో అహ్లదాకారంగా
తయారు చేస్తామని మాట్లాడుతూ తెలిపారు. సానుకూలంగా స్పందించిన తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ , కౌన్సిలర్లకు మీ యొక్క సహకారం మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని డబుల్ బెడ్ రూమ్ కాలనీ అభివృద్ధి చెందాలని అందుకు సహకరిస్తున్న మీకు సిద్ధి వినాయక కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎం సతీష్, శ్రీకాంత్, కాలనీవాసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking