మైనంపల్లి హనుమంతరావు నర్సారెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించిన తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ.
మెదక్ తూప్రాన్ మార్చ్ 29 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ , కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వకంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు , గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బోకే శాలువాతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, నర్సారెడ్డిలు తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ లను అభినందించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు , నర్సారెడ్డి లో మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడనికి కృషి చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని లబ్ధిదారులకు అందేలా చూడాలని, తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ లు శ్రీశైలం గౌడ్, కొడిప్యాక నారాయణ గుప్తా, జిన్నా భగవాన్ రెడ్డి, రవీందర్ గుప్తా, రఘుపతి, రాజు ,తాజా మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి, భగవాన్ రెడ్డి , పి ఎసి ఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
