ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 25 : దండేపల్లి మండలం లోని ముత్యంపేట గ్రామంలోని కారుకూరి సత్తన్న ఇటీవల మరణించడంతో తక్షణ సహాయంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి 50 కిలోల బియ్యం,నిత్యవసర సరుకులను పంపడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ… దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామం లోని కారకూరి సత్యన్న ఇటీవల మరణించడంతో ఈ విషయం పై బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లికి తెలియడం తో వేంటనే వారు స్పందించి 50 కిలోల బియ్యంని ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గాదె శ్రీనివాస్,బీసీ మోర్చా మండల అధ్యక్షులు ముత్తె అనిల్ కుమార్ ముత్యంపేట గ్రామ ఉప సర్పంచ్ ముత్తె వెంకటేష్ బూత్ అధ్యక్షులు దోరిషెట్టి దినేష్ దయ్యాల వెంకటేష్ మోట పలుకుల గంగన్న పాల్గొని అందించడం జరిగింది.