ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 25 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్లో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.శనివారం కిండర్ గార్డెన్ పూర్తిచేసిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం కిండర్ గార్డెన్ డిప్లమా సర్టిఫికెట్స్ అందించారు.పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ….యూకేజీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం కిండర్ గార్డెన్ డిప్లమా సర్టిఫికెట్ అందజేస్తాము.ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లలకి చదువుపై మరింత ఆసక్తి కలుగుతుంది. విద్యార్థులలో దాగివున్న అంతర్గత శక్తిని బయటికి తీయడమే నిజమైన విద్య అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మినిమల శ్రీనివాస్ డైరెక్టర్ మహమ్మద్ హామీద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు.