సమస్యల పరిష్కారంలో తోడై ఉంటా

రామగుండం సిపి రమ రాజేశ్వరి

పెద్దపల్లి ప్రజాబలం మార్చ్ 25÷

సమస్యల పరిష్కారానికి పోలీసుల సహాయం పొందాలని రామగుండం సిపి రమా రాజేశ్వరి అన్నారు శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా ప్రతినిధులు సిపి రమ రాజేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపిని శాలువతో సన్మానించి మెమొంటోను అందజేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో సిపి మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమం సంఘం చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో మహిళా సాధికారత తో పాటు విద్యార్థిని విద్యార్థుల సంక్షేమ హాస్టల్లో సమస్యల పరిష్కారం విద్య, వైద్యం ప్రజలకు చేరువయోదశలో తమ సంఘం పోరాటం చేస్తున్నట్లు సంఘ ప్రతినిధులు సీపీకి వివరించారు. సంఘం యొక్క ఆశయాలు తెలుసుకున్న సీపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి తోడుగా నిలుస్తానని తెలిపారు. సంఘ ప్రతినిధులు ఎప్పుడైనా వచ్చి సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయం పొందవచ్చు అని తెలిపారు.

సిపి రమ రాజేశ్వరిని కలిసిన వారిలో జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్ గౌడ్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు వింజమూరు సురేష్ జిల్లా బీసీ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి బొద్దుల అరుణ రామగుండం మండల అధ్యక్షురాలు మనోహరతోపాటు రజని, మంథని నియోజకవర్గం అధ్యక్షురాలు మమతా శ్రీనివాస్ లు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking