జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్
పెద్దపల్లి ప్రజాబలం మార్చి 25 ÷
దేశవ్యాప్తంగా బీసీల జన గణన లెక్కించడానికి కాంగ్రెస్ పార్టీ సానుకూల నిర్ణయం తీసుకుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజు ఠాకూర్ తెలిపారు శనివారం రామగుండం లోని తన నివాసంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తలపెట్టిన చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమ పోస్టర్ను మక్కాన్సింగ్ ఆవిష్కరించారు దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీ వర్గాలకు సరియైన ప్రాతినిధ్యం లభించడం లేదని మక్కాన్సింగ్ పేర్కొన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నట్లు జనగణతోపాటు కులగనన చేపట్టాలని డిమాండ్ సా హేతుకమైందని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం బీసీల కుల గణన చేపడతామని అధికారంలోకి వచ్చి వారిని మోసగించిందని పేర్కొన్నారు నాటి హోంశాఖ మాత్యులు రాజ్ నాథ్ సింగ్ ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీల కులగనన ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపడతామని మాట తప్పడం దుర్మార్గమైన చర్య అని అన్నారు రానున్న యూపీఏ గవర్నమెంట్ లో తప్పకుండా బీసీల కులగన నా చేపడతామని అన్నారు
. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఘనంగా సన్మానించారు తన సోదరీ అయినా జిల్లా మహిళా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బొద్దుల అరుణను మక్కాన్సింగ్ శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్ గౌడ్ రామగుండం నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షులు వింజమూరు సురేష్ మంతిని బీసీ మహిళా సంఘ అధ్యక్షురాలు మమత రామగుండం మహిళా బీసీ సంఘ అధ్యక్షురాలు మనోరతో పాటు రజని శ్రీనివాసులు పాల్గొన్నారు