జాతీయ పార్టీ ఎంపీ లు 16 మంది ఉన్న తెలంగాణకు మొండి చెయ్యి చూపించిన బిజెపి

 

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్

ఖమ్మం ప్రతినిధి జులై 23 (ప్రజాబలం) ఖమ్మం కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మేడిపండు చందంగా,పక్షపాతంతో కూడుకొని ఉన్నదని తెలంగాణాకు మొండి చెయ్యి చూపించారని, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఊసేలేని బడ్జెట్ ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రోడ్లు, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, హాండ్లూమ్ పార్క్స్, కొత్త రైల్వే ట్రాక్సు ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించారని అన్నారు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఏడవ సారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పక్షపాతంతో కూడుకొని ఉన్నది, తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయించి స్వామి భక్తిని ప్రదర్శించింది 1.48 కోట్లు విద్య నైపుణ్య అభివృద్ధికి ఏ మూలకు సరిపోవని గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన నిధులు చూస్తే,2.66 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా చూసినప్పుడు కేటాయింపులుతక్కువగా ఉన్నాయి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు మరలా గ్రామీణ ప్రాంత పేదలకు మూడు కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పడం మోసపూరితమైనది వచ్చే సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయం కోటి మందితో చేపడతామని చెప్పడం వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులు చూస్తే1.52 లక్షల కోట్ల మాత్రమే ఇది రైతాంగాన్ని మభ్యపెట్టే కార్యక్రమం, కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటుంటే సంవత్సరానికి ఒక్క లక్ష మందికి విద్యా రుణం ఇస్తామని చెప్పడం విద్యార్థులను మోసం చేయడమే విద్యారంగానికి కేటాయించిన నిధులు అరకొర గతంలో ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలు మాటను,మరిచి కొత్త వాగ్దానాలు చేస్తున్నారు, 500 పెద్ద కంపెనీలు పెట్టి కోటి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పటం పెద్ద అబద్ధం ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు ప్రజల సామాజిక ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి బదులు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పటం రాజకీయం తప్ప మరొకటి కాదు 8 నెలల కోసం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేదిగా ఉంది ఆశ్చర్యకరంగా అప్పులు వసూలు చేయటానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది అప్పులు రద్దు చేసేది వీరే బడా బడా పెద్దలకి రాయితీలిచ్చి ఆదుకునేది వీరే ప్రజలను నమ్మించడానికి ఇటువంటి ట్రిక్స్,,12 ఇండస్ట్రియల్ పార్క్ లు పెడతామని చెప్పారు ఎక్కడో చెప్పలేదు,వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు అనుగుణంగా కేటాయింపులు లేవు కొన్ని పంటలకే మద్దతు ధర ప్రకటించారు మిగతా వాటిని విస్మరించారు తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు తెలంగాణ ఎడల వారికున్న వైఖరి తెలియజేస్తుందని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking