వన మహోత్సవం మొక్కలను సంరక్షించాలి
మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 11వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని అయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…చెట్ల పెంపకం ద్వారా మానవ మనుగడ సాధ్యమౌతుందన్నారు. ప్రకృతి పరిణామ క్రమం సక్రమంగా ఉండేందుకు చెట్లు దోహదం చేస్తాయన్నారు. అందుకే మన పూర్వికులు చెట్లను దేవతలుగా పూజించారన్నారు. అనంతరం11వ వార్డులోని మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్,కో ఆప్షన్స్ సభ్యులు నూనె ప్రవీణ్,వార్డు అధ్యక్షుడు ముత్తె తిరుపతి,మున్సిపల్ సిబ్బంది,ఈఈ కట్ల రాకేష్,వార్డు ఆఫీసర్ శ్రీదేవి,చరణ్ తదితరులు పాల్గొన్నారు.