.
రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 23 జులై 2024:
ది సిటిజన్స్ కౌన్సిల్ ఉప కార్యదర్శి, వేంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు, గీతుస్ ప్రాజెక్ట్స్ బిల్డర్ బొమ్మూ ఉపేంద్రనాధ్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా గత వారం రోజులుగా మునిసిపాలిటీ నిధులతో సంబంధం లేకుండా మణికొండ లోని రహదారి మరమ్మత్తులు స్వంత ఖర్చులతో చెయిస్తున్న విషయం తెలుసుకొని తెలంగాణా పూర్వ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రశంశలు చేయడం జరిగినది, ఈ రోజు అల్కాపూరి రోడ్డు నెంబర్ 25 లోని అన్హుహార్ హోమ్స్ నుండి మహాత్మా గాంధి పార్క్ వరకు జరుగుతున్న పనులను పర్యవేక్షణ గావిస్తున్న 7 వ వార్డ్ కౌన్సిలర్ బీట్లు పద్మారావు, 8 వ వార్డ్ కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, ది సిటిజన్స్ కౌన్సిల్ కార్యదర్శి షేక్ ఆరిఫ్ మొహమ్మద్, స్థానిక సామాజిక కార్యకర్త జూపల్లి జగన్, ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు తది తరులు.
