ఈటెల రాజేందర్ కు మద్దతుగా నాచారం లో బిజెపి భారీ ర్యాలీ

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 11:
మల్కాజిగిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ జాతీయ నాయకులు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గెలుపుకోసం మద్దతుగా 1000 బైక్ లతో బిజెపి అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో మూడో సారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు మొదటి మెట్టుగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి తీరుతామని నాయకులు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఈటెల రాజేందర్ ,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంపాల పద్మారెడ్డి, రవి నాయక్, మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాస్, ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ బాలచందర్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, రాంప్రదీప్, గొరిగే కృష్ణ,గడ్డం సాయి, తెలంగాణ సంపత్,కాప్రా డివిజన్ అధ్యక్షులు వినోద్, ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు రమేష్ యాదవ్, మీర్పేట్ కాలనీ అధ్యక్షులు అనుముల మహేష్, నాచారం డివిజన్ అధ్యక్షులు మల్క ప్రకాష్, చిల్కనగర్ డివిజన్ అధ్యక్షులు గొనె శ్రీకాంత్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి మరియు ఉప్పల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking