వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తే ‘విజయం’ ను సీఎం కి బహుమతిగా ఇస్తా

–వరంగల్ పార్లమెంట్ అస్పిరంట్ ప్రసాదరాజు

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా మార్చ్11: వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలుపొంది తన విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తానని వరంగల్ పార్లమెంట్ అస్పిరెంట్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు శివరాశి ప్రసాదరాజు పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను గెలిపిస్తే కేంద్రం నుండి రావలసిన నిధులు తెప్పించి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఆయన చెప్పారు. అభివృద్ధి ధ్యేయంగా, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.బిఆర్ఎస్,బిజెపి పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు.

తనకు అవకాశం వస్తే విజయం సాధించి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తానని ఆయన చెప్పారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు ప్రజాదరణ ఉందని ఆయన అన్నారు. తన సీనియారిటీని పార్టీ పరిగణలోనికి తీసుకొని టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానానికి విన్నవించారు. తాను గతంలో వరంగల్ మున్సిపల్ చైర్మన్ గా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పై గెలుపొందాననీ ఆయన చెప్పారు. తనకు టికెట్ ఇస్తే గెలిచి ప్రజలతో ఉంటానని ఆయన చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ రాజేందర్,మాజీ మార్కెట్ డైరెక్టర్ కె.పూర్ణచందర్,పార్టీ సీనియర్ నాయకులు పి.యాదగిరి,కొట్టే భాస్కర్, స్వామి చరణ్,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కాగా విలేకరుల సమావేశం అనంతరం ప్రసాదరాజు పరకాల,భూపాలపల్లి ఎమ్మెల్యేలు, రేవూరి ప్రకాశ్ రెడ్డి,గండ్ర సత్యనారాయణ లను మర్యాదపూర్వకంగా కలిశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking