చెన్నూరు లో 100 బైక్ లతో భారీ ర్యాలీ బిజెపి నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 : అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం లో బి జె పి ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస ఆధ్వర్యంలో సుమారు 100 బైక్ లతో చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో బైక్ ర్యాలీ చేస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని నినాధాలిస్తు చాలా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం చెన్నూర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో గల డా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్ మాట్లాడుతూ….ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆనాడు ఉద్యమ సమయంలో దళితుల ఓట్లు దండుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితున్నే మొదటి ముఖ్యమంత్రి చేశానని దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని అనేకమైన ప్రగల్బాలు పలకడమే కాకుండా కనీసం ఈ తొమ్మిది సంవత్సరాల అధికార సమయంలో ఏనాడు కూడా అంబేడ్కర్ జయంతికి గానీ వర్ధంతి కి గానీ కనీసం గడప దాటి బయటకు రాని ముఖ్యమంత్రి ఏకంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని వ్యంగ్యాస్త్రాలు చేసిన ముఖ్యమంత్రి రేపటి రోజు అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ సూచక మే కానీ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని బి ఆర్ ఎస్ చేయడం అంటే చెట్టు పేరు చెప్పి కఆయలమ్ముకున్నట్టు మళ్లీ అధికారంలోకి రావడానికి మరొక్కసారి దళితులను బలి పశువులను చేయడమే కదా అని పత్తి శ్రీనివాస్ మాట్లాడారు అభివృద్ది అంటే రంగుల గోడలు అద్దాల మేడలు కాదని పేదలకు మెరుగైన వైద్యం విద్య ఉచితంగా అందిన నాడే నిజమైన అభివృద్ది అని చెప్పడం జరిగింది.వీరితో పాటు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ నగునురి వెంకటేశ్వర్ గౌడ్,చెన్నూరు పట్టణ అధ్యక్షుడు సుద్దపల్లి సుశీల్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్,జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు తలారి రాజు,పట్టణ ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్,పట్టణ ఉపాధ్యక్షుడు కొంపెల్లి బానేష్,పెండాల శ్రీకాంత్,పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గడిపల్లి సంతోష్,పట్టణ యువమోర్చా అధ్యక్షుడు గడ్డ మహేష్,దమ్మ సంజయ్,శివకృష్ణ,కొరకొప్పుల వంశీ గౌడ్, మంచాల మంచాల ప్రవీణ్,పెద్దింటి లక్ష్మణ్, మచ్చ నరేష్,మోర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking