రాజేంద్రనగర్ ప్రజాబలం ప్రతినిధి:రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీకి పట్టుకొమ్మ అయిన పుప్పాలగుడ గ్రామం నుండి శాసనసభ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో, శాసన మండలి ఎన్నికలలో పార్టీ సభ్యూలకు మెజారిటీ రావడం జగమెరిగిన సర్వ సాధారణ విషయం, అయినప్పటికీ పార్టీ పెద్దలు తమకు సరిjైున గుర్తింపు ఇవ్వడం లేదని ఇక్కడి సీనియర్ నాయకులు, కౌన్సిలర్ లుగా పోటీచేసిన వ్యక్తులు పార్టీ కార్యకలాపాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు, అట్టి పరిస్థితిని చేజించి నాయకులందరూ పార్టీ పట్ల వారికి ఉన్న అభిమానం గౌరవంతో అంతర్గతంగా సమావేశమై రాబోయే అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దీర్గంగా చర్చించుకొని ఏకాభిప్రాయంతో ప్రస్తుత కాలంలో పార్టీ ఆదేశానుసారం తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనంను జయప్రదం కావించుకొని, స్థానిక శాసన సభ్యునితో సమావేశం జరుపుకొని తమ దీన పరిస్థితిని వివరించి పరిస్థితులు సఖ్య పడేలా అందుకు అనుకూలంగా స్థితి గతులను మలుచుకుని పార్టీ బలోపేతానికి నడుంబిగించి ముందుకు వెల్డామని నిర్ణయం తీసుకోవడం జరిగినది, తదనంతరం రంజాన్ పండుగ సందర్భంగా బషీర్ అందరికి ఖర్జూర పండ్లను వితరణ చేయడం జరిగింది, ఈ సమావేశంలో మాజీ ఎం పి పి శివప్రసాద్, సునీత రాజ్కుమార్, కృష్ణ రాజి, లక్స్మిశ్రీ, గుట్టమీది నరేందర్, చంద్రకాంత్ గౌడ్, బషీర్, విఠల్, అందె లక్ష్మణ్ రావు, గణేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, సంతోష్ కుమార్, శ్రీశైలం, ప్రకాష్, రాజేష్, మహేందర్, సుమన్ ఆదిగా పాల్గొన్నారు.