జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యం కోసం ఆర్థిక సహాయం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 : జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యం కోసం ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని నాగ సముద్రం గ్రామానికి చెందిన సుందరగిరి నరేష్ (33) ఇటీవల హనుమాన్ దీక్ష విరమణ కోసం కొండగట్టు దేవ స్థానానికి వెళ్తూ ప్రమాద వశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నరేష్ ను స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు,వైద్యానికి పెద్ద మొత్తంలో కనీసం 10 లక్షల కర్చు అవుతుందని వైద్యులు అన్నారు,రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబానికి చెందిన నరేష్ రోజు వారి కులీ పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు అంత డబ్బు పెట్టీ వైద్యం చేయించే స్తోమత లేని నిరు పేదా కుటుంబం వైద్యానికి ఎవరైనా దాతలు సహాయం చేయాలని బార్య పిల్లలు‌ వేడుకుంటున్నారు,విషయం తెలుసుకున్న మన జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్) సభ్యులు 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు,ఈ సహాయ కార్యక్రమంలో కుదురుపాక కార్తిక్,కంది కుమార్,వెంకటేష్,అశోక్,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking