వయసు మల్లినోళ్ళ తొలగింపుపై నిర్లక్ష్యం
_ఏప్పుడో ఉత్తర్వులోచ్చినా అమలుకాని వైనం
_
జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 13,( ప్రజాబలం ) పొదుపు సంఘాల్లో వయసు మళ్లిన వారిని తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఉత్తర్వులు జారీచేసినా జగిత్యాల మెప్మాలో సర్కారు ఉత్తర్వులను పక్కనపెట్టిన సంఘటన ఇది. పొదుపు గ్రూపులో 58 ఏండ్లు దాటినా వారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలంటూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లోని మెప్మా పి.డి.లకు ఉత్తర్వులు జారీచేసింది. అయినా నేటి వరకు కేవలం కొందరు ఆర్పీల చొరవతో వందలాది గ్రూపుల్లోంచి కేవలం పదుల సంఖ్యలోనే తొలగింపు జరిగినట్లు తెలిసింది. ఇంకా ఎన్నో గ్రూపుల్లో వయసు మల్లినోళ్ళను కొనసాగిస్తూ అక్రమాలకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గ్రూప్ సబ్యులకు స్త్రినిది రుణాలు జారికావాలంటే వ్యవహరమంతా గ్రూప్ ప్రెసిడెంట్, ఆర్పీ తోపాటు బ్యాంక్ మేనేజర్ చేతుల్లో ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ రుణాల మంజూరి సమయంలో గ్రూప్ సభ్యుల ఆధార్ కార్డ్ తో వయసు నిర్దారణ చేసుకొని అందులో రిటైర్డ్ మెంట్ కు దగ్గరగా ఉన్న వాళ్లకు రుణాల మంజూరిని నిలిపివేయాలన్నట్లు నిబంధన ఉన్నట్లు మెప్మాలోని కొందరు అంటున్నారు. ఇలా బ్యాంక్ మేనేజర్లు చేసే నిర్లక్ష్యపు పనులతో తీసుకొన్న పొదుపు రుణం చెల్లించే పూర్తి సమయానికి వారి రిటైర్డ్ మెంట్ సమయం మించిపోతున్నట్లు తెలుస్తోంది. వయసు మళ్లినోల్లను ఎందుకు తొలగించడం లేదని పలువురు మెప్మాలో అడిగితే వారిపేరుపై ఉన్న రుణం పూర్తిగా ముట్టలేదని చెప్పి తప్పించుకొంటున్నట్లు తెలుస్తోంది. ఇలా మెప్మాలో పెరుగుతున్న నిర్లక్ష్యం మూలంగా ఔత్సాహిక మహిళలు, యువతులకు గ్రూపుల్లో అవకాశం రాక స్వయం ఉపాధికి దూరమవుతున్నట్లు ఓ ఆర్పీ పేర్కొంటుండడం విశేషం. ఇప్పటికైనా జిల్లా అదనపు కలెక్టర్ స్పందించి మెప్మాలో మార్పులకు శ్రీకారం చుట్టి నిబంధనలు పక్కాగా అమలు చేసి ఏజ్ భారోళ్లను తొలగించి మహిళా యువతకు పొదుపు సంఘాల్లో అవకాశం కల్పించాలని పలువురు కోరుకుంటున్నారు