మెదక్ ప్రజాబలం న్యూస్ :-
తూప్రాన్ లో మెజార్టీ సాధించినందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను.. మాట ఇచ్చిన ఎంపి రఘునందన్ రావు
డిగ్రీ కళాశాల, పలు అభివృద్ధి పనులపై చర్చించిన జానకిరామ్ గౌడ్
తూప్రాన్ మండల అభివృద్ధిపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో కలిసిన బిజెపి తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు జానకిరామ్ గౌడ్ తూప్రాన్ పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మరియు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ తో ..భాజపా నాయకులు చర్చించారు ఎంపీ పరిధిలోని ముఖ్య నాయకులు మూడు రోజులపాటు రఘునందన్ తో పాటు ఉండి కేంద్ర ప్రభుత్వంతో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని వారు కోరారు.. రఘునందన్ రావు సానుకూలంగా స్పందించి ప్రత్యేకంగా తూప్రాన్ లో మెజారిటీ ఇచ్చినందున తూప్రాన్ పైన దృష్టి సారిస్తానని జానకి రాముకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.