ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న వర్ధంతి
మహనీయుల స్పూర్తితో హక్కుల సాధన
అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 06 : మహనీయుల స్పూర్తితో ప్రజా హక్కులు సాధనకు పోరాడుతామని,షాద్ నగర్ లో దళిత మహిళాపై దాడుల్లాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పట్టణ అధ్యక్షులు తొగరు రాజు పేర్కొన్నారు.మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ ఆశయాలు కొనసాగించాలన్నారు. పీడిత,తాడిత,ప్రజల విముక్తి కోసం,బానిస బతుకులు మారాలని నిరంతరం కలలు గన్న గద్దరన్న జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం.ఆ మహనీయుల బాటలో నడవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శెనిగారపు లింగన్న,చాతరాజు రాజన్న,ముల్కల్ల రాందాస్,దొంత నర్సయ్య, భైరం లింగన్న, భైరం రవి, అల్లంపల్లి రమేష్,గరిసే రవీందర్,మామిడి సందీప్, కల్లేపల్లి విక్రమ్,కళ్యాణం రవి,కోమాకుల రవీందర్, చుంచు రమేష్,సర్దార్ సత్తన్న,గోల్కొండ సత్తయ్య, బన్న శ్రీనివాస్, అడ్లూరి దేవేందర్, వేల్పుల సాగర్, బీసీ,మైనారిటీ నాయకులు, పాల్గొన్నారు.