తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయం లో జయశంకర్ 90 వ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్తగా రాష్ట్ర సాధనకు బ్రతికున్నంత కాలం అలుపెరగకుండా కృషిచేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నార.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో స్వపరిపాలన, సుపరిపాలన సాధ్యమని సాధికారికంగా ప్రజలను చైతన్యపరిచిన దార్శనికుడు జయశంకర్ సర్ అని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం నాడు ఖైరతాబాద్ లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయం లో జయశంకర్ సర్ 90 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. అంజలి ఘటించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటం వద్ద పుష్పాలు సమర్పించారు.
ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రసంగిస్తూ “తెలంగాణ” రాష్ట్రం నిమిత్తం యావత్ దేశాన్ని మెప్పించి, ఒప్పించిన వారిలో జయశంకర్ సార్ దే మొదటి స్థానం అని అన్నారు.
ఈ కార్యక్రమం లో బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు శుభప్రద్ పటేల్, కే. కిషోర్ గౌడ్, అసిస్టెంట్ సెక్రెటరీ జి. సతీష్ , ఓఎస్డీ. కే తులసిరామ్ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.