తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ కరీంనగర్ బార్ అసోసియేషన్ కు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది రూపి రెడ్డి దేవేందర్ రెడ్డి నియామకం అయ్యారు, ఈ మేరకు రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక ఉత్తర్యులు సోమవారము అందచేసారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం , గుమ్లాపూర్ గ్రామనికి చెందిన రూపి రెడ్డి దేవేందర్ రెడ్డి విద్యార్థి దశ నుండే న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు. డిగ్రీ కళాశాలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పనిచేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ,దుద్దిల్ల శ్రీధర్ బాబుకు జిల్లా అధ్యక్షులు కవ్వం పల్లి సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవేందర్ రెడ్డి నియామకం పట్ల
జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు
కల్లెపెల్లి లక్ష్మయ్య, న్యాయవాదుల సహకార సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి లక్మ రెడ్డి, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వి రాజ్ కుమార్ తదతరులు హర్షంవ్యక్తంచేశారు.
Prev Post