కడెం ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలి బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 17 : కడెం ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలి బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి డిమాండ్
కడెం ప్రాజెక్టు ద్వారా దండేపల్లి, లక్షెట్టిపేట,హాజీపూర్ మండల రైతులకు 37 డిస్ట్రిబ్యూటరి నుండి 42 డిస్ట్రిబ్యూటరి కెనాల్ వరకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో రైతులతో కలిసి లక్షెట్టిపేట పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ…వర్ష కాలంలో కూడా రైతులకు సాగు నీరు అందించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు.కడెం ప్రాజెక్టు ద్వారా 900 క్యూసెక్కుల నీరు అందించాల్సి ఉన్న కేవలం 700 క్యూసెక్కుల నీరు అందించడంతో దండేపల్లి, లక్షెట్టిపేట,హాజీపూర్ మండల రైతులకు సాగు నీరు అందక రైతులు వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయి అని అన్నారు.గత సంవత్సరం కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తుల పేరుతో ఎమ్మెల్యే దివాకర్ రావు కమిషన్లు దండుకున్నారే తప్ప ప్రాజెక్ట్ గెట్లకు మరమ్మత్తుల చేయలేదని అన్నారు.ఎమ్మెల్యే కమిషనర్లకు కక్కుర్తి పడి రైతుల పొట్ట కొడుతున్నారని అన్నారు.గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మార్పు ఇప్పటి పూర్తి చేయకపోవడంతో లిఫ్ట్ ద్వారా నీరు అందించలేని పరిస్థితి ఉందని అన్నారు. కేవలం ఒక్క చేతగాని ఎమ్మెల్యే ఉండటం వల్లనే మంచిర్యాల నియోజకవర్గ రైతులకు ఈ పరిస్థితి ఉందని అన్నారు.కడెం ప్రాజెక్టు 37 డిస్ట్రిబ్యూటరి నుండి 42 డిస్ట్రిబ్యూటరి కెనాల్ వరకు సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.రైతుల సమస్యలు పరిష్కారం కాకుంటే రైతులతో కలిసి త్వరలో రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొప్పు కిషన్,గుండా ప్రభాకర్,వేముల మధు,బందేల రవి గౌడ్, దుమ్మనీ సత్తన్న,గడికొప్పుల సత్తయ్య, శ్రీరామ,చిన్నయ్య, మోటపలుకుల సతీష్, బాణాల రత్నం,నరేష్,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking