కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ విస్తరిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వర్గంటి రామ్మోహన్ గౌడ్ బిజెపి నాయకులు

 

మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్ :-

తెలుగు రాష్ట్రాల్లో కీలక మార్గాల్లో రైల్వే లైన్ విస్తరణ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది, తెలంగాణలో వివిధ రూట్లల్లో 433.82 కిలో మీటర్లు మేర నూతన రైల్వే లైన్లను కేంద్రం నిర్మానించనుంది . ఇందులో భాగంగా ( ముద్గేడు) నుండి మేడ్చల్ డబ్లింగ్కు డోన్ లైను ఆమోదించడం జరిగింది, మహబూబ్ నగర్ డబ్లింగ్కు రైల్వే లైన్ కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా ఈరోజు మెదక్ జిల్లా మనోహరాబాద్ రైల్వే స్టేషన్ లో, బీజేపీ రాష్ట్ర నాయకులు మెదక్ పార్లమెంట్ కన్వినర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . భారత్ మాతాకీ జై అంటూ జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ బిజెపి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం
బిజెపి రాష్ట్ర నాయకులు మెదక్ పార్లమెంట్ కన్వీనర్

వర్గంటి రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ
ఈ రైలు మార్గం పేదలకు ఎంతో అందుబాటులో ఉంటుందని , హైదరాబాద్ బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనిందని , వివిధ రూట్లో నూతన రైల్వే స్టేషన్ నిర్మితం కానున్నయని , నిరుపేదలు వ్యాపారం చేసుకునే వాళ్లకు రవాణా సౌకర్యంగా ఎంతో ఉపయోగపడుతుందని కొత్త మార్గం పూర్తయితే వందే భారత్ వంటి
రైళ్ళ కు ఉపయోగకరంగా ఉంటుందని , రైలు మార్గమే కాకుండా దేశ ప్రజల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని , నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని దేశ నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిరంతరం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి నరేంద్ర మోడీ అని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మనోరబాద్ మండల అధ్యక్షుడు నరేందర్ చారి , గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా యువమోర్చా నాయకులు కిరణ్ యాదవ్, అజయ్ కుమార్, తూప్రాన్ మండల అధ్యక్షులు మహేష్ యాదవ్ , శ్రీకాంత్,అనిల్ బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking