ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 25 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మంగళవారం అందజేయడం జరిగింది. దండేపల్లి కేంద్రానికి చెందిన వేమునూరి రాజమౌళి వారి కూతురు సుమలత ని వెల్గనూర్ గ్రామానికి చెందిన చుంచు గంగన్న కుటుంబ సభ్యులను,వెల్గనూర్ గ్రామానికి చెందిన కాండ్రపు మల్లేష్ కుటుంబ సభ్యులను, కన్నెపల్లి గ్రామానికి చెందిన తోట లింగన్న కుటుంబ సభ్యులను రెబ్బనపల్లి గ్రామానికి చెందిన గాలిపల్లి గురువయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి 5000 రూపాయల చొప్పున మొత్తం 25000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొట్టే సత్తయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడంతో వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దండేపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, ప్రధాన కార్యదర్శి బందేల రవి గౌడ్,గుండా రవీందర్, కిసాన్,బత్తుల శేఖర్,వనపర్తి రాకేష్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.