రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్తో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూలై 25: మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల సూచనల మేరకు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా అన్ని వీడియో జాగ్రత్తలు తీసుకుంటామని ఈ విషయంలో అధికారులను సైతం అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎద్వారా కమిషన్ సూచనల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ ద్వారా ఫారం 6, ఫారం 7, ఫారం 8 క్రింద వచ్చిన దరఖాస్తులను తో పాటు జిల్లా వ్యాప్తంగా అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఫారమ్ డిస్పోజల్పై అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని దీనిని రేపు బుధవారం సాయంత్రం వరకు అన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే తాను కూడా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించినట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై ముందస్తు సమావేశాలు సైతం నిర్వహించడం జరుగుతుందని అలాగే ఎన్నికల నిబంధనలు కూడా వివరించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లో ఓటర్లకు ఓటుపై అవగాహనతో పాటు ఈవీఎమ్లు, వీవీప్యాట్స్ సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నామని మోబైల్ వ్యాన్ల ద్వారా కూడా ఓటు వేసే విధానం తదితర వివరాలను తెలియచేస్తూ ఓటు హక్కు గురించి అధికారులు వివరిస్తున్నారని కలెక్టర్ అమోయ్ కుమార్ కాన్ఫరెన్స్లో వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, కీసర ఆర్డీవో రాజేష్కుమార్, ఎన్నికల అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.