ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డును చోటు చేసుకున్న శ్రీ హనుమాన్ చాలీసా శ్రీ నిత్య శ్రీనివాస స్వామి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 25 : మంచిర్యాలలో హైటెక్ సిటీలో జి హెచ్ ఆర్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న శ్రీ నిత్య శ్రీనివాస స్వామి శ్రీరామ దీక్షను తీసుకొని గత 108 రోజుల నుండి శ్రీ హనుమాన్ చాలీసా ఇంటింటా పారాయణం చేసి 108 వ రోజు 108 సార్లు 108000 సార్లు పారాయణం చేసినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డును శ్రీ నిత్య శ్రీనివాస స్వామి వారి కి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ మడుపు రాంప్రకాష్ చేతుల మీదుగా మరియు మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్,నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు విజిత్ రావ్,మంచిర్యాల బిజెపి అధ్యక్షుడు వేర్రబెల్లి రఘునాథ్ రావు 29వ వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి గార్లచే అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వండర్ రికార్డు సంస్థ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మడుపు రాంప్రకాష్ మాట్లాడుతూ… నిత్య శ్రీనివాస్ వారి తండ్రిగారి దగ్గర నుండి వంశపారపర్యంగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రచారకులుగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విశిష్ట కార్యక్రమాన్ని ఇంటింటా 108 రోజులు నిర్వహించినందుకు గాను ఈ రికార్డును అందజేసి ప్రపంచానికి మార్గదర్శకంగా పరిచయం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో గీత భవన్ చంద్రశేఖర్ శెట్టి సురభి రవి విశ్వేశ్వర శర్మ రామ్మోహన్రావు భావన ఋషి ఉపేందర్ ప్రతాపరెడ్డి మహేందర్ రెడ్డి అశోక్ చిటినేని హనుమంతరావు కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.