ఐపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు
హైదరాబాద్ జూలై 25 (ఐపిసి పంచ సూత్రాలైన మాతృ ప్రేమతో పరిపాలన ప్రతి మనిషికి విద్యా వైద్యం ఉచితం భారతదేశ మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం మతసామరస్యాన్ని పాటిస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం మానవసేవే మాధవసేవ లకు ఆకర్షితులై సంఘ సేవకులు రాజకీయ చైతన్యం కలిగిన యువకులు ఐపిసి పార్టీలో చేరుతున్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. మంగళవారం బషీర్బాగ్ లిబర్టీ ప్లాజా లో ఐపీసీ క్యాంప్ ఆఫీస్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవ రావు ఆధ్వర్యంలో అచ్చంపేటకు చెందిన పలువురు ఐపిసి పార్టీలో చేరారు. వీరికి ఐపిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ పార్టీ కండవాని కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ ఐపిసి పంచ సూత్రాలకు ఆకర్షితులై తాము చేరుతున్నట్లు మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి మరింత మంది చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టుతున్నట్లు తెలిపారు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర మొత్తం ప్రజాదర్శన పేరుతో అన్ని నియోజకవర్గాలు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బావ స్వరూప్య0 గల పార్టీలతో కలిసి పని చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా యువ నాయకులు కె నరేంద్ర ,నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల్ మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలకు ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు తెలిపారు