దిశానిర్దేశం లేని విపక్ష పార్టీలు
దేశం పేరును వాడుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరు
ఓడిపోయి, అలసిపోయి, ఆశలేని మిగిలిపోయిన విపక్షాలు
న్యూఢల్లీి జూలై 25 ఇటీవల విపక్ష పార్టీలు తమ కూటమి పేరును ఇండియాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్. మొత్తం 26 విపక్ష పార్టీల కలయికే ఇండియా అని ఇటీవల జరిగిన బెంగుళూరు భేటీలో కాంగ్రెస్ నేత ఖర్గే పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పడిన ఇండి యా కూటమిని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్ ముజాహిద్దిన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్‌ఇండియాలాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపిం చారు. ఇంతగా దిశలేని విపక్షాన్ని ఎప్పు డూ చూడలేదని ప్రధాని మోదీ ఇవాళ జరిగిన బీజేపీ భేటీలో పేర్కొ న్నారని సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ తెలి పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి పార్టీలను కూడా విదేశీ యులు ప్రారంభించినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. దేశం పేరు ను వాడుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టిం చలేరని ప్రధాని ఆరోపించా రన్నారు. ఓడిపోయి, అలసిపో యి, ఆశలేని పార్టీలుగా విపక్షాలు మిగిలిపోయినట్లు ప్రధాని పేర్కొన్నారు.
Prev Post