దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

👉 కరపత్రం విడుదల సిఐటియు జిల్లా కార్యదర్శి జి,సాయిలు,

ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 25, ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాన్ని జిల్లా సిఐటియు కార్యదర్శి జి, సాయిలు, విడుదల చేశారు, స్థానిక సిఐటియు కార్యాలయం ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి,(సీఐటీయూ జిల్లా కార్యదర్శిజి,సాయిలు )మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను, కాలరాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా 29, కార్మిక చట్టాలను రద్దు చేసి , నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చింది అన్నారు, వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం ఫలితంగా, అమలకు ఆలస్యం అవుతున్న, మోడీ ప్రభుత్వం బరితెగించి, పెట్టుబడిదారులకు అనుకూలంగా అమలు వేగవంతం చేయాలని నిర్ణయించిందన్నారు, దీంతో కార్మికులు,యూనియన్లు పెట్టడం, హక్కులు అడగటం, పోరాటాలు చేయటం, కష్టతరంగా అవుతుందని అన్నారు, యూనియన్ రిజిస్ట్రేషన్ కనీస వేతనం ఇతర చట్టపరమైన సౌకర్యాలు, సమ్మెకు వాటికి ఈ కోడ్స్ ద్వారా ప్రమాదం ఉంటుందన్నారు, 8 గంటల పని దినాల్లో మార్పు చేస్తూ 12 గంటలు పని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కోడ్స్ ద్వారా వీలు కల్పిస్తుందని అన్నారు, బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న, కార్పొరేట్ అనుకూల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు, దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను హక్కులను, హరిస్తున్న సమయంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఎంతగానో ఉందన్నారు, హక్కుల రక్షణ కోసమే మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని కార్యవర్గం పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, విద్యాసాగర్, అందోల్ డివిజన్ నాయకులు, కృష్ణ రాములు, సురేష్, ప్రభాకర్, నాగేష్ రాజు ,పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking