👉 పాత జాబ్ కార్డులలో పేరు నమోదుకు అవకాశం ఇవ్వాలి
👉 రెండు నెలల బకాయిలు వెంటనే ఇవ్వాలి
👉 తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్
ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 25 (ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా, ఆందోల్ నియోజకవర్గం లోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం,నర్సింలు, ఆధ్వర్యంలో అందోల్ మండలం అల్మాయపేట, చౌటకూర్ మండలం శివంపేట్, గ్రామాలలో పర్యటించడం జరిగింది, ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం,నర్సింలు. మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ జాబ్ కార్డు పొందే హక్కు ఉందని, జాబ్ కార్డు ఇవ్వకుండా నిరాకరించడం అంటే పని కల్పించే బాధ్యతనుండి ప్రభుత్వం తప్పుకోవడం కిందికే వస్తుందని, ఆవేదన వ్యక్తం చేశారు, ఈ రకమైన నిర్ణయం చట్టాన్ని ఉల్లంఘించడమేనని, అనేకమంది 18, సంవత్సరాలు నిండిన వారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారందరికీ జాబ్ కార్డు ఇవ్వకుండా ఆపడం అంటే, ఒక తరాన్ని ఉపాధి హామీ పనికి దూరం చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కాకుండా చేయడమే అవుతుందని అన్నారు, యువశక్తిని అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా అనుసరించే తిరోగమన విధానాలకు , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలకాలని వెంటనే జాబ్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు, రెక్కఆడితే కానీ డొక్కాడని గ్రామీణ ప్రాంత పేదలుగా ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారిని, ఆహార భద్రతకు, సామాజిక భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి, దూరంగా నెట్టే చర్యలకు పాలకులు సిద్ధపడటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు, రెండు నెలలుగా ఉపాధి హామీ, బకాయిలు పేరుకుపోయాయని, కూలీలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు తెచ్చుకొని డ్వాక్రా చిట్టీలు కుటుంబ పోషణకు ఉపయోగిస్తున్నారని, వెంటనే రెండు నెలల బకాయిలు ఇవ్వాలని, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు, అయినటువంటి టెంట్లు, మంచినీళ్లు, మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇవ్వాలని అన్నారు, ఉపాధి హామీ చట్టం ప్రతికూలీకి పనిముట్లు ఇవ్వాలని చెబుతున్న ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు, రెండు నెలల బకాయిలు పనిముట్లు కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో అందోల్ ఏరియా ఇన్చార్జి జయరాజు, సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాజు, ఉపాదామి కూలీలు పోచయ్య, వీరయ్య, కుమార్, మల్లేశం, లక్ష్మి, దుర్గేష్, బాబు,అరుణ్ కుమార్, మొగులయ్య, వీరమణి, భాగ్యమ్మ, భారతమ్మ,సంగమ్మ, లక్ష్మి, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.