డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: సమాజం పటిష్టంగా ఉండాలంటే ప్రతి వ్యక్తికి విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలని పోరాడిన సమసమాజ దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
సమాజంలో అసమానతలను భరించడం కాదు వాటిని ఎదురించి నిర్మూలించాలని పోరుబాట పట్టాలని బోధించిన సామాజిక పరివర్తకుడు మహాత్మా పూలే అని వకుళాభరణం పేర్కొన్నారు.
గురువారం నాడు 135వ మహాత్మా పూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ ఆలీ కేఫ్ చౌరస్తా వద్దగల మహాత్మా పూలే విగ్రహానికి పూలమాలవేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో మాట్లాడుతూ..
కుల వివక్షతను బహిరంగంగానే వ్యతిరేకించి దాని నిర్మూలనకు భారత సమాజంలో వెలుగులు ప్రసరించేలా చేసిన మహనీయుడు పూలే అని ఆయన అన్నారు.
స్త్రీ విద్య ద్వారా సమాజ అభివృద్ధికి బలమైన పునాది వేశారు అన్నారు.
సమాజంలో అన్యాయాలను ప్రశ్నించడమే కాదు నిర్మూలన కూడా ఆయన జీవితాంతం కృషి చేశారు అని అన్నారు.
కుల వివక్ష నుండి ప్రజలకు విముక్తి లభించాలని, సామాజిక అసమానతలను ఎప్పటికప్పుడు బహిరంగంగా ఎత్తిచూపారు ప్రజలను చైతన్యవంతులను చేశారు ఆయన కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా వివక్ష నిర్మూలనకు నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలను చేశారు.
పూలే సత్యశోధక సమాజ్ పీడిత వర్గాలకు గొంతుగా నిలబడిరది ఆయన ఆశయాలు ప్రగతిశీల సమాజ నిర్మాణానికి కీలక అడుగులుగా పడ్డాయి.
సమాజ శ్రేయస్సు అంటే అందరికీ సమాన హక్కులు లభించాలని పూలే పోరాడారు అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు డిక్లరేషన్ల పేరిట ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొని ఫలితాలు అందించినప్పుడే మహాత్మా పూలేకు ఘనమైన నివాళి అని డాక్టర్ వకుళాభరణం అభిప్రాయపడ్డారు.