మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లొ జ్యోతిరావ్‌పూలేకు ఘననివాళి

మెదక్‌ ప్రజాబలం ప్రతినిధి:గురువారంనాడు జ్యోతి రావు వర్ధంతి సందర్బంగా మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లొ బ్లాక్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పూలె చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు హాఫిజ్‌ మొల్సాబ్‌ మాట్లాడుతూ జ్యోతి రావు పూలె బడుగు బలహీన వర్గాల అభ్యునతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుధాని, సామజిక సంస్కార్త, మహిళ విద్యభివృద్ధి కి మార్గ దర్శిగా నిలిచిన నిత్య స్ఫూర్తి అని కొనియాడారు, ఆ మహనీయుడి ఆశయాలు లను కోన సాగించాలని కోరారు, ఈ కార్యక్రమం లొ మాజీ కౌన్సిలర్‌ లు మంగ మోహన్‌ గౌడ్‌, మేకల రవి మాజీ సర్పంచ్‌ శ్రీకాంత్‌ దేవులా నాయక్‌ ముజీబ్‌ గాడి రమేష్‌ నాని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking