జీహెచ్‌ఎంసీ ప్రజాబలం ప్రతినిధి:సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలోభాగంగా వివరాలు నమోదు చేయించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న ఎన్యుమరేటర్, అధికారులు.
హాజరైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, తదితరులు.
సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.
ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను ఆరా తీసిన సీఎం.
హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.
ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.
వీలయినంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం.