మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

నగర డిప్యూటీ మేయర్‌ శ్రీమతి మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి
తార్నాక ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌, 28,నవంబర్‌: మహాత్మా జ్యోతిరావు ఫూలే 134 వ వర్ధంతి పురస్కరించుకుని, గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర డిప్యూటీ మేయర్‌ శ్రీమతి మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి మరియు టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌ రెడ్డి , డిప్యూటీ మేయర్‌ క్యాంప్‌ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సేవలు, ఆయన చూపించిన మార్గదర్శకత, ముఖ్యంగా విద్య, సామాజిక సమానత్వం, మరియు దళిత, పేద, మహిళల హక్కుల పరిరక్షణలో చేసిన విప్లవాత్మక కృషి గురించి అలాగే మహాత్మా ఫూలే ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత. సమాజంలో సామాజిక సమానత్వం మరియు అణగారిన వర్గాల అభివృద్ధికి మనం కృషి చేయాలి’’ అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking