పాఠశాలలో అవసరమైన మరమ్మతులు వెంటనే చెప్పటాలని ఆదేశం.
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి
……జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి నవంబర్ 28 ప్రజ బలం ప్రతినిధి:
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బిసి బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కిచెన్ షెడ్డు డైనింగ్ హాలు, స్టోర్ రూమ్, మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారుల ఆదేశించారు. మరుగుదొడ్లు కిటికీలు డోర్ లకు అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపల్ ఆదేశించారు. భవనం యజమానితో మాట్లాడి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని కస్తూరిబా పాఠశాలలో సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు తాసిల్దారులు ఎంఈవోలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకత నిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనమందేల చూడడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు వారి స్థాయిలో జరిగే మరమత్తు పనులను ఆయా భవనాల యజమానులతో మాట్లాడి వెంటనే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థులకు మేలు ప్రకారం నాణ్యమైన భోజనం అందాల చూడాలని ఎక్స్పైరీ డేట్ దాటిన వస్తువులు వాడకూడదు అని సూచించారు. వసతి గృహాలకు గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతతో ఉండేలా పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి సి ఒ కిరణ్ కుమార్, తహసిల్దార్ రాంబాబు, వసతి గృహ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.