-పట్టణ ఎస్ఐ శివనీతి రాజశేఖర్
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 28
మందమర్రి పట్టణంలోని సి ఇ ఆర్ క్లబ్ డిసెంబర్ 2 న నిర్వహించే బాల ప్రతిభ కళోత్సవ్ రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలను విజయవంతం చేయాలని మందమర్రి పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యా ర్థులు, చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేం దుకు ట్యాలెంట్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలను కళాకారులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం నిర్వాకుడు సునాకర్ రాంబాబు మాట్లాడుతూ ఈ పోటీలలో క్లాసికల్ జానపదం సినిమా నృత్య పోటీలు ప్యాన్సీషో, సాంస్కృతిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో
ప్రోగ్రాం ఇంచార్జి ముడారపు శేఖర్,అకాడమీ సలహాదారులు గుడికందుల రమేష్ లు పాల్గొన్నారు.