3 రోజులలో వరిధాన్యం నగదు రైతుల ఖాతాలలో జమ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 28 : ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నిబంధనల ప్రకారం వరిధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో 3 రోజులలోగా నగదు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం కొంత మంది రైతులు తమ ఖాతాలలో నగదు జమ కావడంతో జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావుతో కలిసి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి వరిధాన్యం కొనుగోలు చేస్తుందని,సన్నరకం ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అదనంగా చెల్లిస్తుందని తెలిపారు.జిల్లాలోని జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన తవుటం రాయమల్లుకు సంబంధించి 38.80 క్వింటాళ్ళ సన్నబియ్యంకు గాను 2 వేల 320 రూపాయల మద్దతు ధరతో 90 వేల 16 రూపాయలతో పాటు 500 రూపాయల బోనస్ సొమ్ము 19 వేల 400 రూపాయలు, ఆకటుకూరి కార్తీన్రెడ్డికి సంబంధించి 101.20 క్వింటాళ్ళకు 2 లక్షల 34 వేల 784 రూపాయల మద్దతు ధరతో పాటు బోనస్ సొమ్ము 50 వేల 600 రూపాయలు, మాయా శ్రీనివాస్ కు సంబంధించి 44.80 క్వింటాళ్ళకు గాను 1 లక్షా 3 వేల 936 రూపాయలతో పాటు బోనస్ సొమ్ము 22 వేల 400 రూపాయలు,చందురాల జైపాల్రెడ్డికి సంబంధించి 83.20 క్వింటాళ్ళకు గాను 1 లక్షా 93 వేల 24 రూపాయల మద్దతు ధరతో పాటు బోనస్ సొమ్ము 41 వేల 600 రూపాయలు జమ కావడం జరిగిందని తెలిపారు.రైతులు మధ్య దళారీలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ రమేష్,రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking