గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 29 నవంబర్ 2024
తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం 1 నవంబర్ 1956 మొదలు కొని అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న దరిమిలా ఆరు దశాబ్దాల ప్రజా పోరాటాన్ని తుది దశకు తీసుకు రావడం కొరకు, తెలంగాణ చరిత్రను మలుపు తిప్పడానికి 2009 నవంబర్ 29 న ఉద్యమ నేత, తెలంగాణ మొదటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రావడమో తాను చావడమో అనే నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టిన రోజును మన మందరం మదిలో తలచుకుని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కుంటున్న విపరీత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దీక్షా దివస్ ను స్ఫూర్తిగా తీసుకొని గులాబి దళ సైనికులు మరొక్కసారి కదం తొక్కుతూ ముందుకు సాగుదామని, ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రతిజ్ఞ పూని మణికొండ భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరు ఏకీకృత్తమై కలసి కట్టుగా స్థానిక పార్టీ నాయకత్వం బలపడేలా పుప్పాలగూడ ఎల్.ఐ.సి కాలనీ వద్ద గుట్టమీది నరేందర్, విఠల్ ల ఆధ్వర్యంలో పతాకావిష్కరణ మొదలుపెట్టి, మణికొండ ఆంధ్ర బ్యాంకు సర్కిల్ వద్ద సంగం శ్రీకాంత్ ఆధ్వర్యంలో, పైప్ లైన్ రోడ్డులో గల లాలమ్మ గార్డెన్ సమీపంలో బుద్దోల్ బాబు ఆధ్వర్యంలో చివరగా నెక్నoపూర్ గవర్నమెంట్ పాఠశాల వద్ద కందాడ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ పతాకావిష్కరణ గావించడంతొ మొత్తంగా మణికొండలో నాలుగు చోట్ల తెలంగాణ రాష్ట్ర పార్టీ పతాకావిష్కరణ గావించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ళ ధనరాజ్ ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని స్థానిక కౌన్సిలర్ నవీన్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, సీనియర్ నాయకులు ముత్తాంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, బొమ్ము ఉపేందర్నాధ్ రెడ్డి, యాలల కిరణ్, రామసుబ్బా రెడ్డి, మల్లేష్, రాజేంద్ర ప్రసాద్, విజయ లక్ష్మి, నాయుడు, షేక్ ఆరిఫ్, గణేష్, శ్రీకర్, బాబు, దిలీప్, బొడ్డు శ్రీధర్, మహేష్, శ్రీనివాస్, బాలజీ, రేఖ, సుమ, నర్సింగ్ రావు, కృపాకర్, కరుణాకర్, మొనేశ్, తిరుపతి, ఎల్లస్వామి, ఉసేన్, గట్టు చంద్రశేఖర్, గోపి సాగర్, సంగం ప్రశాంత్, బాలకృష్ణ, రాజు, చారి తది తరులు గైకొన్న తదనంతరం తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు త్రిప్పిన దీక్షా దివస్ కార్య క్రమంలో పాల్గొనడానికి శంషాబాద్ లో ఉన్న రంగారెడ్డి జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంనకు తరలి వెళ్లిన పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు.