బిజెపి పార్టీ భూతం మాదిరి తెలంగాణ ను కబళించాలని కుట్ర చేస్తుంది. : హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌

మూడు లక్షల కోట్ల తెలంగాణ ఆదాయాన్ని అదానీకి ఎలా కట్టబెట్టాలానీ చూస్తున్నారు
తెలంగాణకు పెద్ద ఎత్తున మిడతలదండులా వచ్చి అసత్యప్రచారాలు , మతపరమైన విద్వేషాలు సృష్టిస్తూ వస్తున్నారు – దాసోజు శ్రవణ్‌ గారు
పేపర్‌ లీకేజ్‌ తో కేసీఆర్‌ ప్రభుత్వం ఫై బురద జల్లే ప్రయత్నం చేస్తున్రు – దాసోజు శ్రవణ్‌ గారు
మనమంతా ఐదు వెళ్లు లెక్క కాదు ..ఓ పిడికిలి లెక్క ఉండాల్సిన అవసరం ఉంది – దాసోజు శ్రవణ్‌ గారు
హైదరాబాద్‌, ప్రజాబలం ప్రతినిధి: ఏప్రిల్‌ 7: బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు మన ప్రియతమా మంత్రివర్యులు గౌరవనీయులు కేసీఆర్‌ గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా ముషీరాబాద్‌ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ సమక్షంలో గాంధీనగర్‌ డివిజన్‌ లో ప్రెసిడెంట్‌ రాకేష్‌ ఆధ్వర్యంలో జవహార్‌ నగర్‌ కమ్యూనిటీ హాల్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ హోసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గారు, రాంనగర్‌ మాజీ కార్పొరేటర్‌ శ్రీ శ్రీనివాస్‌ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. పార్టీ లో చిన్న చిన్న మస్పర్దలు , పంచాయితులు ఇంకేమున్న అవన్నీ మరచిపోయి..అంత కలిసి మెలిసి ఉండాలని మన కేసీఆర్‌ గారు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టారు. ఓ పక్క మనం సాధించిన విజయాలు చెప్పుకుంటూనే..ప్రజలకు మనం చేసిన సేవ చెప్పుకుంటూ..మనమధ్య ఏమైనా మనస్పర్థలు ఉంటె అవన్నీ సమసి పోవాలని.. మనమంతా ఐదు వెళ్లు లెక్క కాదు ..ఓ పిడికిలి లెక్క ఉండాల్సిన అవసరం ఉంది..ఆలా ఉంటేనే శత్రువు కు జవాబు ఇవ్వగలమని దాసోజు శ్రవణ్‌ గారు అన్నారు.
ఈ ఆత్మీయ సమావేశాల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తుకు తెచ్చుకోవాలి..అలాగే పార్టీలో అందర్నీ కలుపుకోవాలి..మంచోడు , చెడ్డోడు , పడ్డాడో ..పడనోడు..కొత్తోడు, పతాడో..ఇలా ఎవరైనా సరే అందర్నీ పిలుచుకోవాలని ..అదే కేసీఆర్‌ కోరుకున్నది అని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తెలిపారు.
అనేక ఉద్యమాలకు సాక్ష్యం ముషీరాబాద్‌. ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా సైనికుడిలా తెలంగాణ కోసం పోరాటం చేసారు. తెలంగాణ ఉద్యమం నడిచేక్రమంలో చాలామంది టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న వారిని హేళన చేసారు. తెలంగాణ వస్తదా ..చస్తదా..కేసీఆర్‌ తెస్తాడా..పోతాడా అని చాలామంది అవహేళన చేసిన పరిస్థితి . ఆ తర్వాత తెలంగాణ వస్తదని అర్థమైన తర్వాత తెలంగాణ వస్తే పరిశ్రమలు పోతాయి..పెట్టుబడులు రావు..కరెంట్‌ ఉండదు ..పరిపాలన చేతకాదు..అభివృద్ధి ఉండదు..తెలంగాణ ప్రజలు వలస వెళ్లి పోవాల్సిందే అంటూ తప్పుడు ప్రచారం చేసారు.
కానీ ఈరోజు కేసీఆర్‌ గారు తెలంగాణ ను ఎంతగా అభివృద్ధి చేసారో చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన సమయంలో 50 వేల కోట్ల ఉన్న బడ్జెట్‌..ఈరోజు మూడు లక్షలకు తీసుకొచ్చారు. ఎన్నో సంక్షేమ పధకాలు , అభివృద్ధి కార్యక్రమాలు , 200 ఉన్న పెన్షన్‌ ను 2000 లకు తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్‌. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్‌ గారు తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేసారు.
కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ , షాదీ ముబారక్‌, మన ఊరు – మన బడి , రైతుబంధు , దళిత బంధు , బస్తి దవాఖాన లు ఇవన్నీ ఇలా వచ్చాయో..గత పాలకులకు సోయలేకుండా ఉన్న తరుణంలో కేసీఆర్‌ గారు ఎంతో బాధ్యతగా పాలనా అందిస్తూ..సంపద సృష్టించిండు..సష్టించిన సంపద ను ప్రజలకు అందిస్తున్న మహానాయకుడు మన కేసీఆర్‌ గారు. అలాంటి కేసీఆర్‌ గారిని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని దాసోజు శ్రవణ్‌ అన్నారు.
2014 లో తెలంగాణ ఎన్నికల్లో తెలిసి ..చేసానో..తెలియక చేసానో నేను ఓ తప్పు చేశా. గల్లీ నాయకుల దగ్గరి నుండి ఢల్లీి నాయకుల దగ్గరికి వరకు చాలామంది తో పనిచేశా..కానీ కేసీఆర్‌ గారి లాంటి నాయకుడ్ని నేను చూడాలే అన్నారు దాసోజు శ్రవణ్‌. కేసీఆర్‌ గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి..కేసీఆర్‌ లాంటి పెద్ద చెయ్యి ఉన్న నాయకుడు దేశంలోనే ఎవడు లేడు. ఆలా ఉంది కాబట్టే ఏకాఏకి రైతు బంధు కు పదివేలు ఇస్తామని , దళిత బందుకు పదిలక్షలు ఇస్తానని , ఏకాఏకి లక్షల రూపాయిల విలువచేసే డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ ఇస్తానని , ఏకాఏకి ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ను మూడేళ్లలో నిర్మించిన ఘనత ఒక్క కేసీఆర్‌ గారికే దక్కింది. అలాంటి గొప్ప నాయకుడు కేసీఆర్‌ గారికి రిటర్న్‌ గిఫ్ట్‌ గా మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దాసోజు శ్రవణ్‌ గారు.
తెలంగాణ అభివృద్ధి చూసి మిగతా రాష్ట్రాలు వారు వచ్చి మా రాష్ట్రాన్ని కూడా తెలంగాణ మాదిరి అభివృద్ధి చేయాలంటూ కేసీఆర్‌ పిప్‌ ఒత్తిడి తెస్తున్నారు. దానికి కేసీఆర్‌ కూడా బిఆర్‌ఎస్‌ పార్టీ ద్వారా దేశ వ్యాప్తంగా తెలంగాణ మాదిరి అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో మహారాష్ట్ర లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పోటీ చేయబోతోందని ఈ సందర్బంగా శ్రవణ్‌ గారు గుర్తు చేసారు.
ఈరోజు హైదరాబాద్‌ అభివృద్ధి చూస్తుంటే మనం హైదరాబాద్‌ లో ఉన్నామా అమెరికా , కెనడా లో ఉన్నామా అనే రీతిలో కేటీఆర్‌ గారు హైదరాబాద్‌ ను అభివృద్ధి చేసారు. ఓ పక్క అభివృద్ధి చేస్తూనే మరోపక్క సంక్షేమ పధకాల , ఫార్మా డెవలప్మెంట్‌, ఐటీ డెవలప్మెంట్‌ , పరిశ్రమల అభివృద్ధి , రోడ్ల అభివృద్ధి , నాలా విస్తరణ , శాంతి భద్రతల పరిరక్షణ ఇలా అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌ గారికి మనం మూడోసారి ముఖ్యమంత్రి ని చేసి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని కార్యకర్తలకు దాసోజు శ్రవణ్‌ గారు సూచించారు.
మరో ఏడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఏడు నెలల్లో రోజు ఓ అరగంట సమయం మనం కేసీఆర్‌ తీసుకొచ్చిన పధకాల గురించి , చేసిన అభివృద్ధి గురించి..మరోసారి కేసీఆర్‌ గారిని గెలిపిస్తే జరగబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజెప్పాలని దాసోజు శ్రవణ్‌ గారు కోరారు.
ఈరోజు బిజెపి పార్టీ భూతం మాదిరి తెలంగాణ ను కబళించాలని కుట్ర చేస్తుంది. మూడు లక్షల కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ ఫై కన్నుపడిరది. మూడు లక్షల కోట్ల ఆదాయాన్ని అదానీకి ఎలా కట్టబెట్టాలా అని చూస్తున్నారు. అందుకే ఈనాడు పెద్ద ఎత్తున మిడతల దండులా వచ్చి అసత్యప్రచారాలు , మతపరమైన విద్వేషాలు సృష్టిస్తూ వస్తున్నారు. అంతే కాదు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా సరే ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూసారు. ఈరోజు పేపర్‌ లీకేజ్‌ తో కేసీఆర్‌ ప్రభుత్వం ఫై బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజ్‌ కి పాల్పడి నిరుద్యోగుల భవిష్యత్‌ ను దెబ్బతీసేలా చేసారు. రాజశేఖర్‌ అనే బిజెపి కార్యకర్త తో పేపర్‌ లీకేజ్‌ చేసి…ఈరోజు కేటీఆర్‌ ఫై , కేసీఆర్‌ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. పదో తరగతి తెలుగు , హిందీ పేపర్లు సైతం లీక్‌ చేసి నీచరాజకీయాలకు తెరలేపారు. ఇవన్నింటిని ప్రజలకు తెలియజేప్పాల్సిన అవసరం బిఆర్‌ఎస్‌ కార్యకర్తల ఫై ఉందన్నారు శ్రవణ్‌ గారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking