బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాద్యం ఎమ్మెల్యే దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 07 : బీఆర్ఎస్ తోనే అభివృద్ధి అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు.శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…లక్షెట్టిపేట మున్సిపాలిటీ ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.8 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అన్ని వార్డుల్లో అనగా 13 వార్డ్ 9 లక్షల రూపాయలతో ఎస్ డి ఎఫ్ ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్, 11వార్డ్ లో 3 లక్షల రూపాయలతో ఎన్ డి ఎఫ్ ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,4 వార్డ్ లో 3 లక్షల రూపాయలతో ఎన్ డి ఎఫ్ ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,15 వార్డ్ లో 10 లక్షల రూపాయలతో ఎస్ డి ఎఫ్ ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,వేయడం జరిగింది అని తెలిపారు,అంతకుముందు మున్సిపల్ చైర్మన్ కాంతయ్య మాట్లాడుతూ…బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో బీఆర్ఎస్ ఎప్పుడూ వెనుకంజ వేయదన్నారు.కెసిఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అభివృద్ధి పథకాలు అందించడమే ముఖ్య ఉద్దేశంగా రూపుదిద్దుకున్నదన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,కో -ఆప్షన్ షాహిద్ అలీ,కౌన్సిలర్ శభానా సజ్జు, నాయకులు మెట్టు రాజు అన్వర్, నయిమ్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking