జగిత్యాల, ఏప్రిల్ 7: జగిత్యాల జిల్లా లోని బీర్పూర్ మండలంలోని కమ్మునూర్, రేకులపల్లి, తుంగూర్ గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదశం కార్యక్రమాన్ని టిడిపి నియోజకవర్గ కో ఆర్డినేటర్ మహంకాళి రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాజన్న పేర్కొన్నారు. 10 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో 9 ఏండ్ల తెరాస పాలనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి పాలనలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ప్రజలను రాజన్న కోరారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపిని ఆదరించాలని మహంకాళి రాజన్న కోరారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సూర్వీ సంతోష్ రావు తన అనుచరులతో కలిసి రాజన్న ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బత్తుల కొండయ్య, విజయ్ కుమార్, నక్క లక్ష్మణ్ తోపాటు పలువురు ఉన్నారు.