జిల్లా ఎం.పీ. రఘునందన్ రావు ఆదేశాల మేరకు
బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత
ప్రజాబలం – మెదక్ జిల్లా నియోజకవర్గం 3 సెప్టెంబర్ 2024 :
మెదక్ మండలంలోని తిమ్మక్కపల్లి తండా నివాసి రాట్ల సూర్య గత నెల ఆరవ తారీఖు నాడు బ్రతుకుతెరువు గురించి దుబాయ్ వెళ్లి అక్కడ మరణించాడని తెలిసిన వెంటనే నిన్నటి రోజు మెదక్ ఎం. పీ .రఘునందన్ రావు గారిని కలిసిన విషయం విదితమే గౌరవ ఎంపీ రఘునందన్ రావు గారి సూచనల మేరకు ఈరోజు తిమ్మకపల్లి తండాకు వెళ్లి సూర్య కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పి ఓదార్చడం జరిగింది. అదేవిధంగా వారికి కావలసిన నిత్యవసర వస్తువులను బిజెపి మెదక్ జిల్లా శాఖ తరపున అందజేయడం జరిగింది . బాదిత కుటుంబానికి బిజెపి అండగా ఉంటుందని, భరోసా ఇవ్వడం జరిగింది. బాధితుని యొక్క సతీమణి అయినటువంటి సరితకు ఉపాధి కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కి తెలియజేయునయినది .తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే రాష్ట్రంలోని అందరి బతుకులు బాగుపడతాయి,బంగారు తెలంగాణ ఏర్పడుతుంది,ఇంటికొక ఉద్యోగం వస్తుంది,ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూములు వస్తాయ్ అని చెప్పి ఆశపెట్టి అధికారంలోనికి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలే,డబుల్ బెడ్ రూములు రాలే,గరీబుల బతుకులు బాగుపడలే ,ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి విషయం అందరికీ తెలుసు.ప్రస్తుతం ఈ రాట్ల సూర్య కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి సరితకు ఉపాధి చూయించి వారి పిల్లలకు చదువుకోడానికి విద్య సదుపాయాలను కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమైండ్ చేస్తూన్నాము.
రాట్ల సూర్య యొక్క మృతదేహాన్ని భారతదేశానికి తెప్పించడానికి భారత రాయబారిగా కార్యాలయము మరియు దుబాయ్ రాయబార కార్యాలయంతో ఎంపీ గారు మాట్లాడడం జరిగింది అబుదాబిలో ఒక న్యాయవాది తో మాట్లాడడం జరిగింది ఇందులో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మ్లన్ రెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండవీన,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్,పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి సార్ లక్ష్మణ్ మొదలగు వారు పాల్గొన్నారు