రెవెన్యూ, పంచాయితి కార్యదర్శుల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి
సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఐ.ఏ.ఎస్
ప్రజాబలం -మెదక్ జిల్లా ప్రతినిధి 3 సెప్టెంబర్ 2024:
మంగళవారం ఐడిఒసి కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహణపై పోలిస్, రెవెన్యూ, పంచాయితి రాజ్, విద్యుత్, మున్సిపాల్టీ, మత్స్యశాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించి భక్తులు బాధ్యతాయుతంగా పూజించాలని ఆయన కోరారు.
మట్టి వినాయకులను నెలకొల్పి పూజించడం తో పర్యావరణానికి మేలు
కలుగుతుందన్నారు.
ఉత్సవాల సమయంలో ప్రథమ చికిత్స కోసం అంబులెన్సలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖకు సూచించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో అధికారులు నిమజ్జనానికి ఉత్సవ కమిటీలతో సమన్వం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గణపతి నిమజ్జనం జరిగే చెరువులు, వాగులు, గోదావరి నది వద్ద పోలిస్ శాఖ తరుపున పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు.
పంచాయితీ రాజ్ శాఖ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు, త్రాగునీరు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరం మేరకు తాత్కాలిక సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు.
మత్స్య శాఖ ద్వారా గజ ఈత గాళ్ళను ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అంబులెన్స్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని తెలిపారు.
విద్యుత్ శాఖ ద్వారా గణపతి మండపాలకు విద్యుత్ అనుమతులు జారీ చేయాలని, విద్యుత్ తీగలు కింద, విద్యుత్ స్తంభాలు ప్రక్కన మండ్పాలను ఏర్పాటు చేయకుండా నియంత్రణ చేయాలని అన్నారు.
జిల్లాలో వినాయక ప్రతిమలు నిమజ్జనం జరిగే చోట క్రేన్ లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని అన్నారు.
మండపాలనిర్వహక
నిమజ్జన ప్రక్రియపైఅవగాహన కల్పించాలని తెలిపారు.
వినాయక మండపాల వద్ద ప్లాస్టిక్ వినియోగించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యర్దాలు వేసేందుకు తప్పని సరిగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగానిర్వహి
చుటకు ప్రజలుఅధికారులకు సహకరించాలని
జిల్లాలో వినాయక చవితి (గణేష్ చతుర్థి) వేడుకలనుప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు తమ తమ ప్రాంతాల్లోని గణేష్ ఉత్సవ కమిటీలకు సహకరించాలని అన్నారు.అనంతరం మట్టి వినాయకులను నెలకొల్పి పూజించడం తో పర్యావరణానికి మేలు అనే నినాదంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్ పోస్టర్లను ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ, ఉదయ్ కుమార్ మెదక్ ఆర్ డి ఓ రమాదేవి తూఫ్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, సంబంధిత పోలీస్ రెవిన్యూ ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ మునిసిపల్, పంచాయతీ సంబంధిత శాఖల అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు