ఖమ్మంలోనూ బిజెపి విజయకేతనం ఎగరవేస్తుంది బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ

 

అమ్మ ప్రతినిధి మార్చి 31 (ప్రజాబలం) ఖమ్మంలో విజయకేతనం ఎగురవేసి భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించబోతోందని ఆదివారం పట్టణంలో జరిగిన పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తల సమావేశంలో వక్తలు గట్టి ధీమా వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా పార్టీ గెలిచే 400 పైగా స్థానాల్లో ఖమ్మం కూడా ఉండేందుకు ప్రతి కార్యకర్తా శక్తివంచన లేకుండా కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ దేశంలో మూడోసారి కూడా మోడీ సర్కార్ వస్తుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు విశదీకరించేందుకు కృషి చేయాలని ఆయన నాయకులకు, కార్యకర్తలను సూచించారు ఈ ఎన్నికల్లో మోడీ ఇక్కడ ఖమ్మంలో పోటీ చేస్తున్నారన్న భావనతో పనిచేయండి ఈ ఎన్నికల్లో దేశంలో బీజేపీ 370, ఎన్డీఏ 400 పైగా స్థానాల్లో గెలుస్తాయి. అందులో ఖమ్మం సీటు కూడా ఉంటుంది అని అయన కార్యకర్తల కరతాళధ్వనుల మధ్య అన్నారు.
ఖమ్మం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం కల్పిస్తే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా జిల్లాకు ఎన్నో పథకాలు తీసుకుని వస్తానని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తా తానే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అనే విధంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు. బూత్ లెవల్ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు ఓటర్లు గతంలో కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు, కమ్యూనిస్ట్ లకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్క అవకాశం నాకు ఇస్తారన్న నమ్మకం నాకుంది అని వినోద్ రావు అన్నారు.


బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చరిత్రలో మొదటి సారి బీజేపీ ఎంపీ సీటు గెలవబోతుంది అన్నారు. గడిచిన 60 ఏళ్లలో కాంగ్రెస్ , బీఆర్ ఎస్ పార్టీలు జిల్లా ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు ఈ ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మధ్యనో, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనో జరగడం లేదని బీజేపీ పార్టీకి కుటుంబ పార్టీల మధ్య ఎన్నిక జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ గ్యారెంటీలను అన్నింటినీ విస్మరించిందన్నారు క్లస్టర్ ఇన్చార్జ్ మార్తినేని ధర్మారావు గారు మాట్లాడుతూ పార్టీ విజయమే ధ్యేయంగా అహరహం అవిశ్రాంతంగా కృషిచేయాలని చెప్పారు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రభారీ శ్రీకాంత్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ మరియు జిల్లా నాయకులు జిల్లా పదాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking