ఖమ్మం ప్రతినిధి మార్చి 31 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా వివిధ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను మరియు పుష్పాలంకరణ కార్యక్రమంలో చిరంజీవిలను అక్షింతలు వేసే ఆశీర్వదించారు దీనిలో భాగంగాకామేపల్లి మండలం బండిపాడు గ్రామానికి చెందిన జాటోత్ మంగ్త్- అంజమ్మ ల కుమారుడు హరికిషన్ – అఖిల వివాహం బండిపాడు గ్రామంలో మరియు పండితాపురం గ్రామానికి చెందిన అరి పిన్ని అశోక్ – భవానీ కుమార్తెలైన లోహిత, వర్షశ్రీ ల ఓణీల అలంకరణ వేడుకలో మల్లి బాబు యాదవ్ పాల్గొని చిరంజీవిలను ఆశీర్వదించారు.రాబోయే రెండు రోజులలో అధికంగా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసు కోవాలని, సాధ్యమైనంత వరకు ఇండ్లలో ఉండటానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుగులోతు లాల్ సింగ్ గుగులోతు బాసు,, నాగరాజు గుగులోతు రాకేష్, గుగులోత్ కిషన్ జాటోత్ రామ, బాల, ఫారెస్ట్ ఆఫీసర్ అరపిన్ని వెంకటేశ్వర్లు మేకల సుగుణ రావు అల్లిక నరసయ్య , పరిమిశెట్టి సాంబయ్య, కేతబోయిన రాంబాబు మేకల మల్లికార్జునరావు, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు