గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాలన్నదే బిజెపి లక్ష్యం.

బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల తిరుపతి.

వేములవాడ రూరల్,( ప్రజాబలం ) ప్రతినిధి:-

మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పాజుల్ నగర్ గ్రామంలో 15 లక్షల రూపాయల సిసి రోడ్డు నిర్మాణం పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన మాజీ వైస్ ఎంపీపీ జక్కుల కవిత – తిరుపతి. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా మంజూరు చేసిన సిసి రోడ్డు రహదారిని గ్రామస్తులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ జక్కుల కవిత- తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుందని, కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లి, గ్రామాలను అభివృద్ధి చేయాలని మన పార్లమెంటు సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృఢ సంకల్పంతో ఉన్నారని, బండి సంజయ్ గతంలో గ్రామానికి వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానం మేరకు గ్రామాలలో సిసి రహదారులు మంజూరు చేయించారని, వేములవాడ రూరల్ మండలంలో 1,04 లక్షలు( కోటి నాలుగు లక్షల రూపాయలు) మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నారని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి ఆయన సహకారంతో మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని ఆయన తెలియజేశారు. ఎంపీ నిధుల మంజూరు కి కృషిచేసిన వేములవాడ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జి చెన్నమనేని వికాస్ కు, రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపికి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాఘవ, బిజెపి పార్టీ నాయకులు కొండవేని బుచ్చయ్య, బోగోజు అరుణ్, చిందంకుమార్, బూత్ అధ్యక్షులు కుమారస్వామి, మాజీ వార్డు సభ్యులు బైరగోని నరేష్, పోగుల రాకేష్, ఏదోన్యాకల మధుకర్, ఎగుర్ల రాజు, బొక్కెన వెంకటేశం, శ్రీనివాస్, సాయిలు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking