అంబర్ పేటలో బిజెపి గెలుపు ఖాయం : ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే రాజీవ్ గుమార్ .

 

భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ శాసనసభ్యులు, అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన ఇంచార్జ్ రాజీవ్ గుమార్ పేర్కోన్నారు. నల్లకుంట డివిజన్ లోని నర్సింహా బస్తీలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంబర్ పేట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని గమనించిన తర్వాత అంబర్ పేట నియోజకవర్గాన్ని బిజెపి కైవసం చేసుకోవడం ఖాయమనే సంకేతం వచ్చిందని ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే రాజీవ్ గుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసమే బిజెపి ఇంటింటి ప్రచారాన్ని చేస్తుందని గౌతమ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట కార్పోరేటర్ అమృత, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking