ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఖమ్మం కలెక్టరేట్ వద్ద సమ్మె లో పాల్గొని సంఘీ భావం తెలిపిన నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 21 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్రంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఏ ఎన్ ఎం ల సమస్యలు తీవ్రతరం అయినప్పటికీ స్పందించాల్సిన ముఖ్యమంత్రి ప్రభుత్వం పట్టించుకోకుండా వారి సమస్యలను గాలికి వదిలేసి పామ్ హజ్ కే పరిమితం అవుతున్నాడని ముఖ్యమంత్రిపై ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ విమర్శించారు.
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఏఎన్ఎం ల ఆందోళన జరుగుతున్నాజీవం లేని అస్థిపంజరం గా తయారైందని ఇలాంటి స్పందన లేని నిరంకుశ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదని రాష్ట్రంలో వేలాదిమంది కార్మికులు తమను రెగ్యులర్ చేయాలని ఎలాంటి నోటిఫి కేషన్లు పరీక్షలు జరపకుండా పర్మినెంట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనని ఆయన అన్నారుగత 23 సంవత్సరాలుగా ప్రభుత్వవైధ్య శాఖలో పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎంలతో పాటు బేషరత్ గా ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని, ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని రంగన్న రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు ఖమ్మం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన జరిపినారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య బీసి సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య మద్ది వీరారెడ్డి సయ్యద్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.