అత్యవసర సమయాల్లో రక్తదానం ఎంతో విలువైనది
డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్,
ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 15 (ప్రజాబలం) ఖమ్మం
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఖమ్మం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించగా, మలబార్ గోల్డ్ డైమండ్ సిబ్బంది శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కూరపాటి ప్రదీప్ , డాక్టర్ చంద్రశేఖర్ , చైర్మన్ డాక్టర్ చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడేందుకు రక్తం చాలా అవసరమని రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు