ప్లూటూ జింక ముందు ఊదండీ…. పొంగులేటి ముందు కాదు…!

 

– ఆయన పొలిటికల్ సింహాం… సింగిల్ గానే వస్తున్నాడు…!!
– దమ్ము, ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో ఢీకొనండి
– తాతా మధు, పల్లా రాజేశ్వరరెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలకు మద్దినేని స్వర్ణకుమారి స్వీట్ వార్నింగ్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 20 (ప్రజాబలం) ఖమ్మం ప్లూటూ జింక ముందు ఊదండీ … పొలిటికల్ సింహాం పొంగులేటి ముందు కాదు…! దమ్ము ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో దమ్ము, ధైర్యం ఉంటే పొంగులేటిని ఢీకొనండని ఎమ్మెల్సీ లు తాతా మధు, పల్లా రాజేశ్వరరెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలకు మద్దినేని బేబి స్వర్ణకుమారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గత మూడు నాలుగు రోజులుగా వారు వ్యవహరిస్తున్న తీరు… పొంగులేటి పై చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి డబ్బు కోసం, కాంట్రాక్ట్ ల కోసం వచ్చారని అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. రూ.2900 కోట్ల కాంట్రాక్ట్ లు అందరికీ ఎలా కేటాయించారో తమ నాయకుడికి అలానే కేటాయించారని, అందులో తమ నాయకుడికి ప్రత్యేకంగా కేటాయించిందేమి లేదన్నారు. ఆ కాంట్రాక్ట్ లలో ఆరుశాతం కమిషన్ ఇచ్చామని, అవసరం వచ్చినప్పుడో… అవకాశం వచ్చినప్పుడో వాటిని బీఆర్ఎస్ నేతలకు ఎలా ఇచ్చామో తెలియజేస్తామన్నారు. హైదరాబాద్ లో వేల ఎకరాలను ఆంధ్ర వాళ్లకు విక్రయించింది మీ సీఎం కేసిఆర్ కాదా అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు తానే పెట్టుబడి పెడతానని మీ ముఖ్యమంత్రి అన్న మాటలు నిజం కావా అని గుర్తుచేశారు. మీది ధనరాజకీయమా కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ధనరాజకీయమా అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ అధినేత తడి గుడ్డ పెట్టి గొంతుకోసిన మాట వాస్తవం కాదా..? మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మిన, పూలు అమ్మిన అంటే తప్పు లేదు కానీ పొంగులేటి కష్టపడి పైకి వచ్చా అని చెప్పడం మాత్రం తప్పా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగింది అంటున్నారు. గత తొమ్మిదేళ్ల నుండి ఎటు పోయారన్నారు. మధిర నియోజకవర్గానికి ఇంఛార్జీ గా ఉన్న పొంగులేటి నాటి టీఆర్ఎస్ పార్టీకి 80 వేల ఓట్లు తీసుకువచ్చింది నిజం కాదా..? అని గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి గెలుపుకోసం పనిచేసిన మీరా పొంగులేటి ని విమర్శించేదని ఆరోపించారు. రైతు బంధు అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న పల్లా రాజేశ్వర రెడ్డి చీమలపాడు బాధితులకు ఎందుకు న్యాయం చేయాలేకపోయారన్నారు. ప్రగతి భవన్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ కాళ్ళు పట్టుకుని, మందు పోసి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న తాతా మధు పొంగులేటి పై ఆరోపణలు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తాతా మధును రాజకీయంగా బొందపెట్టేదాకా తాము తగ్గే ప్రసక్తే లేదని ప్రతినబూనరు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ మలీదు జగన్, సర్పంచ్ పరికపల్లి శ్రీను, నారపోగు వెంకటేశ్వర్లు, దేవరపల్లి అనంత రెడ్డి, మద్ది కిశోర్ రెడ్డి, చింతమళ్ల గురుమూర్తి, రాము, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking